ములుగు రూరల్: రైతులు పండించిన పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.అమ్జద్‌పాషా బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పత్తి పంట 15 వేల ఎకరాలలో సాగు చేశారని వివరించారు. సీసీఐ సాంకేతిక కారణాలతో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని వివరించారు. వెంటనే అధికారులు స్పందించి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment