విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు
ములుగు: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దివాకర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని సూచించారు. ఎలాంటి సమప్యలు ఎదురైనా ఆయా మండలాల విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. ములుగు మండలం 9440814942, మల్లంపల్లి మండలం 8333923909, వెంకటాపురం(ఎం) 944 0814859, గోవిందరావుపేట 9440814857, ఎస్‌ఎస్ తాడ్వాయి 7901678229, ఏటూరునాగారం మండలం 9440814867, కన్నాయిగూడెం 7901678232, మంగపేట 9440814941, వాజేడు 9440159490, వెంకటాపురం(కె) 944081475 మండలంలో ఆయా సెల్ నంబర్‌లలో అధికారులు అందుబాటులో ఉంటారని సూచించారు.
చిన్నబోయినపల్లి
వేబ్రిడ్జి తనిఖీ
ఏటూరునాగారం: మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక లారీలను తరలించకుండా ఉండేందుకు చిన్నబోయినపల్లిలో ఏర్పాటు చేసిన వేబ్రిడ్జి చెక్ పాయింట్‌ను ఏఎస్పీ శివం ఉపాధ్యాయ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకే లారీల్లో ఇసుక వెళ్లేలా వేబ్రిడ్జి సిబ్బంది చూడాలన్నారు. ఇసుక క్వారీల నుంచి వచ్చే వే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వే బ్రిడ్జి సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే చ ర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక తవ్వకాలు జరిపే అవకాశం ఉన్న నదులు, వాగుల వద్ద ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్, మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి, సిబ్బంది పాల్గొన్నారు.
రామప్ప శిల్పకళ
అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ శిల్ప కళ అద్భుతమని అమెరికాకు చెందిన జెస్సికా, విక్కిజెండర్‌లు కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని వారు బుధవారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ చరిత్ర గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా 800 ఏళ్ల క్రితం ఎలాంటి యంత్రాలు లేకుండా ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడం గ్రేట్ అని కొనియాడారు. కాగా అమెరికాకు చెందిన విక్కిజెండర్ కూతురు జెస్సికా ఇటీవల హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామానికి చెందిన సతీష్‌ను ఈనెల 16న ప్రేమ వివాహం చేసుకుంది. రామప్పను సందర్శించిన జెస్సికా, విక్కిజెండర్‌లతో పాటు సతీ ష్ కుటుంబసభ్యులు రుఘునాథ్‌రావు, సత్యనారాయణరావు, శంకర్, ఓదేలు ఉన్నారు.
న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమం
వెంకటాపురం(కె): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమం చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహం ఆవరణలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఆదివాసీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. మండల కేంద్రంలో మార్చి 9న నిర్వహించే న్యాయ నిపుణుల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనితి వెంకటకృష్ణ, పూనెం ప్రతాప్, బొచ్చా నర్సింహారావు, కాక శేఖర్, జయబాబు, రాజబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు
Comments
Please login to add a commentAdd a comment