చట్టాలపై అవగాహన తప్పనిసరి
గోవిందరావుపేట: చట్టాలపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. మండల పరిధిలోని ప్రాజెక్ట్ నగర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోటార్ వెహికల్ చట్టం, విద్యాహక్కు చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, బాల కార్మికుల చట్టం, ఆస్తిహక్కు చట్టం, ఫోక్సో చట్టాల పట్ల అవగాహన పెంచుకుని బాధ్యతాయుతంగా, గౌరవ మర్యాదలతో మెలగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయ సలహాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజుకుమార్, ఏజీపీ చంద్రయ్య, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్
మహేందర్
Comments
Please login to add a commentAdd a comment