నర్సిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి
ఏటూరునాగారం: ఈ నెల 27న జరగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు అన్నారు. మండల పరిధిలోని యూటీఎఫ్ మండల కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా వ్యవహరించారని తెలిపారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని వివరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోడెం సమ్మయ్య, మండల అధ్యక్షులు కిరణ్, ప్రసాద్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయంలో ఈ నెల 26నుంచి జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పోలీస్‌శాఖ తరఫున ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ గురువారం పరిశీలించారు. ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు, స్వామివారి కల్యాణం నిర్వహించే ప్రాంతం, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను చూశారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు శాఖ తరఫున పర్యవేక్షణ చేపడతామని వివరించారు. రామప్ప చెరువులో బోటింగ్, స్నానాలకు అనుమతి లేదన్నారు. 26నుంచి 28వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 12మంది ఎస్సైలతో కలిపి 300మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ వెంట సీఐ శంకర్, ఎస్సై జక్కుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
ఉండాలి
గోవిందరావుపేట: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బాలల పరిరక్షణ విభాగం జిల్లా లీగల్ అధికారి డి.సంజీవ అన్నారు. మండల పరిధిలోని చల్వాయి కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయంతో పాటు చట్టాలపై వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయం గురించి అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థానంలోకి చేరుకోవాలన్నారు.
కలాం స్ఫూర్తి యాత్ర
భూపాలపల్లి అర్బన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో నిర్వహిసుత్న్న కలాం స్ఫూర్తి యాత్ర గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి హాజరై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు అవసరమని తెలిపారు. ఈ సందర్శనలో బృందం సభ్యులు విద్యార్థులతో ఆసక్తికరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు మధులాష్‌బాబు, దిలీప్‌కుమార్, సాయి సుబ్రమణ్యం, రోహిత్ జలగాం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పన్నుల చెల్లింపునకు
సహకరించాలి
భూపాలపల్లి అర్బన్: ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని 8, 10వ వార్డులో గురువారం కమిషనర్ పర్యటించారు. కాలనీ శానిటేషన్ పనులు పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ, రోడ్లు శుభ్రం ఉంచటం, డ్రెయినేజీల శుభ్రత గురించి కాలనీవాసులతో మాట్లాడారు. కాలనీల్లో సమస్యలు పేరుకుపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. పన్నులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ దేవేందర్, వార్డు సిబ్బంది పాల్గొన్నారు.
నర్సిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి
Comments
Please login to add a commentAdd a comment