జంపన్నవాగు వద్ద స్నానఘట్టాల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు శాశ్వతంగా మూడు డ్రెస్సింగ్ గదులు నిర్మించారు. అందులో రెండు జంపన్నవాగు బ్రిడ్జికి దగ్గరగా నిర్మించారు. డ్రెస్సింగ్ గదులు ఉన్న చోట షవర్లు ఏర్పాటు చేస్తే జల్లు స్నానాలు చేసే మహిళలు పక్కనే ఉన్న డ్రెస్సింగ్ గదులు వినియోగించుకోవచ్చు. కానీ, డ్రెస్సింగ్ గదులు లేని చోట షవర్ ఏర్పాటు చేయడంతో స్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. జాతర సమయంలో తాత్కాలికంగా డ్రెస్సింగ్ గదులను ఏర్పాటు చేస్తున్న అధికారులు జాతర అనంతరం వాటిని తొలగిస్తున్నారు. దీంతో శాశ్వత డ్రెస్సింగ్ గదులు ఉన్న చోట షవర్లు ఏర్పాటు చేయకపోవడం ఆ గదులు కూడా నిరుపయోగంగా మారుతుండగా.. మహిళా భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment