ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పోస్ట్
ములుగు/ములుగు రూరల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ములుగు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం మల్లంపల్లి మండలకేంద్రంలో ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో సాయంత్రం చెక్‌పోస్టు వద్ద ఇసుక లారీలను తనిఖీ చేశారు. సమీపంలోని వేబ్రిడ్జి వద్ద కాంటా వేసి అధికలోడ్‌తో వచ్చిన లారీల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీతో పాటు ఎస్సై వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment