విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ములుగు రూరల్: పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం రాత్రి జాకారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.
కలెక్టర్ దివాకర
Comments
Please login to add a commentAdd a comment