సాక్షిప్రతినిధి, వరంగల్:
వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువుంది. ఈనేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్‌రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ని ఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరి కరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్లలో అధికారులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖ మ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 6,509 పురుషులు, 4,288 సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లో ని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నిరంతరాయంగా పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లా కేంద్రాల్లో డిస్టిబ్య్రూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులపై కసరత్తు చేస్తున్నారు.
ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటల కు పోలింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల అధి కారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా..
జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం
కేంద్రాలు
హనుమకొండ 11 15 2,884 2214 5,098
వరంగల్ 13 13 1,381 844 2,225
జనగామ 12 12 556 365 921
మహబూబాబాద్ 18 16 1,083 535 1,618
భూపాలపల్లి 07 07 211 112 323
ములుగు 09 09 394 218 612
మొత్తం 70 72 6,509 4,288 10,797
ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు
ఈనెల 27న పోలింగ్..
వచ్చే నెల 3న లెక్కింపు
ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
అభ్యర్థులు
వేడెక్కిన ప్రచారం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్‌రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ – టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్‌రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్‌రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కైలాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజులే గడువుండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment