సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీతక్కకు వినతి
ములుగు: తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్‌కుమార్, పెరుమాండ్ల తిరుపతి సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీతక్కను కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రిని వారు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించి సమస్యలపై చర్చించారు. అక్కడి నుంచి మంత్రి సీతక్క సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి గతంలో మాదిరిగా బియ్యం డెలివరీకి సహకరించండి, ఒక జిల్లా బియ్యాన్ని వేరే జిల్లాలకు డెలివరీ చేయడానికి మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు రెండు జిల్లాల అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కోశాధికారి మోహన్, రైస్ మిల్లర్లు వాసుదేవారెడ్డి, ఆరె విజేందర్, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి యాంసాని సంతోష్, కోశాధికారి రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
12నుంచి కల్యాణ
మహోత్సవం
ములుగు రూరల్: మండల పరిధిలోని కొత్తూరు దేవునిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతర తేదీలను ఆలయ కమిటీ చైర్మన్ వీరపనేని కిషన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12నుంచి 14వ తేదీ వరకు స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 12వ తేదీన స్వామి వారికి అభిషేకం పూజలు, 13న ఉదయం 11.30గంటలకు స్వామివారి కల్యాణం, 14న హోమం, పూర్ణ హారతి, మొక్కులు సమర్పించుట, బండ్లు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఇసుక లారీ పట్టివేత
ఏటూరునాగారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వీరాపురం క్వారీ నుంచి ఇసుకను తరలిస్తుండగా చిన్నబోయినపల్లి రెవెన్యూ అధికారులు జూనియర్ అసిస్టెంట్ గంపల శంకర్, పోలీస్ లక్ష్మణ్‌నాయక్‌లు పట్టుకున్నారు. బుధవారం చిన్నబోయినపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా లారీ కేపాసిటీకి మించి ఇసుక తరలిస్తుండడంతో అధికారులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు. ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ. పోలీస్ అధికారులు సమష్టిగా ఔట్ చెక్ పోస్ట్ చిన్న బోయినపల్లి వద్ద ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్‌టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు ఓఎస్‌డీ హిమజాకుమార్ 90300 79242 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
సమస్యలు పరిష్కరించాలని మంత్రి సీతక్కకు వినతి
Comments
Please login to add a commentAdd a comment