ఇంటర్ పరీక్షలు షురూ..
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ దివాకర
ములుగు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించారు. హాల్‌టికెట్, పరీక్ష సామగ్రితో కేంద్రాలకు వచ్చిన విద్యార్థులను ముందుగా గేటు వద్ద అధికారులు తనిఖీ చేసి లోపలికి అనుమతినిచ్చారు. ఇతరులు లోపలికి వెళ్లకుండా కేంద్రాల చుట్టూ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు 2,023 మంది హాజరుకావాల్సి ఉండగా 112 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,773 మందికి గాను 1,679 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 250మందికి 238 మంది హాజరయ్యారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ దివాకర ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కేంద్రంలో విద్యార్థుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతులు, వైద్యశాఖ తరఫున ఆరోగ్య శిబిరం ఏర్పాటుపై ఆరా తీశారు. సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందని అడిగారు. మాస్ కాపియింగ్‌కు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి ఇవ్వకూడదన్నారు. జవాబు పత్రాలను పోలీసుల భద్రత నడుమ నిర్దేశిత కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళ ఉన్నారు,
తొలిరోజు ప్రశాంతం
ఇంటర్ పరీక్షలు షురూ..
ఇంటర్ పరీక్షలు షురూ..
Comments
Please login to add a commentAdd a comment