‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ములుగు: మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో బుధవా రం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 21పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాను రెండు రూట్లుగా విభజించినట్లు తెలిపారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ముందస్తుగా శిక్షణ ఇ వ్వాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, మ రుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు క ల్పించాలన్నారు. విద్యార్థులతో పాటు ఎగ్జామ్ ప్యా డ్, పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్లు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సెంటర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో ఉండాలన్నారు. వైద్యశాఖ తరఫున ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీ తరఫున విద్యార్థులను తరలించడానికి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నడుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, విద్యుత్ డీఈ నాగేశ్వర్‌రావు, ఏఎంవీఐ వినోద్‌రెడ్డి, ఆర్టీసీ కంట్రోలర్ బైకాని మోహన్, ఎస్‌టీఓ సురేశ్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సురేందర్, ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి అప్పని జయదేవ్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
ప్రత్యేక బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2022లో దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఫీజు ఉంటుందన్నారు. మార్చి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే వారికి 25శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవ్‌రాజ్, జిల్లా ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీఓలు, ఆర్‌ఐలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ
Comments
Please login to add a commentAdd a comment