సింగరేణి బకాయిలు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడారు. 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.25వేల కోట్ల బకాయిలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులను కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని మోసపూరిత హామీలతో కార్మికులను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 8వ తేదీన ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో సింగరేణి స్థితిగతులపై జనరల్‌బాడీ సమావేశం నిర్వహించి భవిష్యత్ పోరాటాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచీ నాయకులు సుజేందర్, మల్లేష్, రాజు, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం లేడీస్ క్లబ్ మహిళలకు క్రీడాపోటీలను నిర్వహించా రు. ఇల్లంద్ క్లబ్‌లో త్రో బాల్, బాంబ్ ఇన్ సి టీ, బాల్ పాసింగ్ నిర్వహించారు. క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సేవా అధ్యక్షురా లు సునీతరాజేశ్వర్‌రెడ్డి, క్లబ్ కార్యదర్శి రమణివెంకటరామిరెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment