ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) మల్లారెడ్డి అన్నారు. 2024 డీఎస్సీలో ఉద్యోగం సాధించిన 120మంది ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం చివరి రోజు శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రతీ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవడం శుభపరిణామం అన్నారు. విద్యార్థుల సామర్య్థాలను పెంచి ములుగు జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలపాలన్నారు, ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయులు వైవిధ్యంగా ముందుకు సాగుతూ విద్యార్థులను అన్ని అంశాల్లో ముందుండేలా చూడాలన్నారు. వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు రాజేశ్‌కుమార్, ఆడిచర్ల రాజయ్య, మహేందర్, మధు, దిలీప్, సురేందర్, రాంబాబు పాల్గొన్నారు.
ఏఎంఓ మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment