వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామాంజాపూర్ పరిధిలో మే12న జరిగే నాంచారమ్మ జాతరలో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు కోరారు. ఎరుకల నాంచారమ్మ జాతర ప్రదేశాన్ని ఆయన ఆదివారం సందర్శించి నాంచారమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 8 ఏళ్లుగా నాంచారమ్మ జాతరను నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతరలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. జాతరలో భక్తుల సౌకర్యార్ధం మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు కోనేటి రాజు, కేతిరి భిక్షపతి, రాజశేఖర్, పల్లకొండ భాస్కర్, సుభాశ్, ప్రశాంత్, రమేష్, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు రాజు