వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లింగాపూర్ జాతీయ రహదారి శివారులోని నందిపాడు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పులి సంచరిస్తున్నట్లు గొత్తికోయలు గమనించి లింగాపూర్ గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ మేరకు వారు బుధవారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ములు గు ఎఫ్‌ఆర్‌ఓ శంకర్ అటవీశాఖ సిబ్బందితో కలిసి పులి సంచరించిన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఆ ప్రదేశంలో పులి సంచరించినట్లు పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ శంకర్ మాట్లాడుతూ పస్రా రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు వెల్లడించారు. లింగాపూర్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన కూడా పులి సంచరించినట్లు వివరించారు. పులి పాదముద్రల ఆధారంగా ట్రేస్ చేస్తున్నామన్నారు. ప్రజలు, మేకల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పాదముద్రలను గుర్తించిన
అటవీశాఖ అధికారులు
లింగాపూర్ సమీపంలో పులి సంచారం