నష్టాల్లో మిర్చి రైతులు | - | Sakshi
Sakshi News home page

నష్టాల్లో మిర్చి రైతులు

Apr 1 2025 12:00 PM | Updated on Apr 1 2025 12:00 PM

నష్టా

నష్టాల్లో మిర్చి రైతులు

వెంకటాపురం(కె): మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో ఈ సంవత్సరం ఆశించిన మేర దిగుబడి రాలేదు. దినికి తోడు మద్దతు ధర లేక పోవటంతో పెట్టుబడి కూడా రాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఈ సంవత్సరం దాదాపు రెండు వేల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేశారు. గత సంవత్సరం మిర్చి పంటకు క్వింటాకు రూ.22 వేల వరకు ధర ఉండడంతో ఈ సారి మిర్చి సాగు విస్థీర్ణం పెరిగింది. తీరా పంట చేతికి వచ్చే సమయంలో ధర లేక పోవంటతో రైతుల్లో ఆందోళన నెలకోంది. సాగు సమయంలో క్వింటా మిర్చి ధర రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు ధర పలకడంతో రైతులు మురిసిపోయారు. దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.12 వేల వరకు పలుకుంతోంది. దీంతో స్థానిక వ్యాపారులు రూ.9 వేల నుంచి రూ.10 వేలకు కొనుగోలు చేస్తున్నారు.

పెరిగిన వ్యయం

మిర్చి పంట కాతకు వచ్చే సమయానికి తెగుళ్లు ఆశించడంతో పలుమార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. సంబంధిత శాఖ అధికారులు రైతులకు పంటల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించక పోవడంతో రైతులు పురుగు మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగి పోయింది. దుక్కి దున్నడం, ఎరువులు, పైమందులు, తదితర పనులకు ఎకరానికి సుమారు రూ.లక్ష యాభై వేల వరకు పెట్టుబడి అయిందని రైతులు తెలుపుతున్నారు. మిర్చి కోతల సమయంలో కూలీలు దొరకడం లేదని వస్తున్న కూలీలకు రూ.400 చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. మిర్చి ధర పెరిగితేనే పెట్టిన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం కరువు

స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. మార్కెట్‌ సౌకర్యం 140 కిలో మీటర్ల దూరంలో ఉన్న వరంగల్‌ మార్కెట్‌కు లేదా 230 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం మార్కెట్‌కు లేదా ఆంధ్రలో ఉన్న గుంటూరు మార్కెట్‌కు రైతులు తమ మిర్చి పంటను తరలించి విక్రయాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు ప్రస్తుతం ఉన్న మిర్చి రేటుకు అంత దూరం మిర్చి పంటను తరలించలేక స్థానికంగా తక్కువ ధరకు దళారులకు విక్రయించి ఆర్థికంగా నష్ట పోతున్నారు. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

పెట్టుబడి పెరిగింది..

నేను ఆరు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాను. ఈ సంవత్సరం మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో ఎక్కువ మొత్తంలో మందలు కొట్టాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. అలాగే మిర్చి కోతకు కూలీలకు గతంలో రూ.300లు ఉండగా ప్రస్తుతం రూ.400 చెల్లించాల్సి వస్తోంది. దినికి తోడు మిర్చి ధర లేక తగ్గడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు.

– కొప్పుల కృష్ణ, రైతు

కూలీలు దొరకడం లేదు..

నేను నాలుగు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి సాగు చేస్తే పంట చేతికి అందే సమయంలో కూలీలు దొరకడం లేదు. దీంతో కూలీల రేట్లు పెరిగిపోయాయి. పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని అనిపిస్తుంది.

– కోటేశ్వర్‌రావు, రైతు

తెగుళ్లతో పెరిగిన పెట్టుబడి,

తగ్గిన దిగుబడి

మద్దతు ధర లేక రైతుల విలవిల

నష్టాల్లో మిర్చి రైతులు1
1/2

నష్టాల్లో మిర్చి రైతులు

నష్టాల్లో మిర్చి రైతులు2
2/2

నష్టాల్లో మిర్చి రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement