
ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతంతే!
5,022 ప్లాట్లకు 1,020మంది మాత్రమే రుసుం చెల్లింపు
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)కు జిల్లాలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారి నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ములుగు, మల్లంపల్లి, జంగాలపల్లి, ఇంచర్ల, వెంకటాపురం(ఎం), పస్రా, జాకారం, ప్రేమ్‌నగర్, మదనపల్లి, బండారుపల్లి, జీవంతరావుపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లను తీసి విక్రయించారు. భవిష్యత్‌లో ప్లాట్లు, ఇంటి నిర్మాణం, డీటీసీపీ అనుమతుల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు రూ.వెయ్యి చొప్పున దరఖాస్తు రుసుము సేకరించగా జిల్లా తరఫున 2020లో మొత్తం 5,022 ప్లాట్ల కోసం ఫీజులు చెల్లించారు.
1,020 మంది మాత్రమే రుసుము చెల్లింపు
తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఆగస్టు 1వ తేదీ నుంచి రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖల తరఫున మూడంచెల్లో సర్వే చేయించింది. అధికారులు ఎల్1, ఎల్2, ఎల్3 దరఖాస్తుల ఆధారంగా సదరు ప్లాట్ల యజమానులతో కలిసి ఫిజికల్ సర్వే చేశారు. వివరాలను సంబంధిత ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశారు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు వచ్చిన 5,022 దరఖాస్తుల్లో కేవలం 1,020 మంది మాత్రమే ఆన్‌లైన్ రుసుము చెల్లించారు. ప్రాంతాల వారీగా ఉన్న భూమి విలువల ఆధారంగా ప్రజలు ప్రభుత్వానికి చెల్లించిన ఆదాయం సోమవారం సాయంత్రం వరకు రూ. 2.7కోట్లుగా తేలింది. సోమవారం రాత్రి వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
గ్రామాల వారీగా
అవగాహన కల్పించాం..
ఎల్‌ఆర్‌ఎస్‌పై మండలాల వారీగా అవగాహన కల్పించాం. కలెక్టరేట్‌తో పాటు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి వెంబడి ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 31వ తేదీ వరకు రుసుము చెల్లిస్తే 25శాతం రాయితీ ఉంటుందని ప్లెక్సీలు ఏర్పాటు చేశాం. అధికారుల తరఫున అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించాం. సోమవారం వరకు 1,020 మంది ఆన్‌లైన్ ద్వారా ప్రాంతాల వారీగా జనరేట్ అయిన రుసుమును చెల్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
– సంపత్‌రావు, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)
●
సోమవారం సాయంత్రం వరకు రూ.2.7కోట్ల ఆదాయం
రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం
క్రమబద్ధీకరణకు ముందుకు రాని యజమానులు