
సన్నబియ్యం పంపిణీ
ములుగు/ఏటూరునాగారం: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం నుంచి జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు సన్న బిఇయ్యం పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో డీలర్ సర్వర్ లెల్లరేషన్ కార్డు దారులకు సన్నబియ్యాన్ని అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యం పంపిణీ చేయడంపై రేషన్‌కార్డు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి జీసీసీ సేల్స్ డిపోలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తరలివచ్చి బియ్యం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ సేల్స్ మేనేజర్ సుధీర్, నాయకులు వినయ్, రవి, ఠాగూర్, మౌలానా పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని షాపు నంబర్ 14లో సన్న బియ్యాన్ని డీలర్ సుమనశ్రీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

సన్నబియ్యం పంపిణీ