
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం సన్నధాన్యానికి అందిస్తున్న క్వింటాకు రూ.500బోనస్‌ను పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఇంచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాదం ప్రవీణ్‌కుమార్, కూనూరు అశోక్, భరత్, వైస్ చైర్మన్ సాంబయ్య, తిరుపతి, వంశీకృష్ణ, రైతులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా నాణ్యమైన భోజనాన్ని అంది స్తుందన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, నల్లెల్ల భరత్, వంశీ, అభినయ్ పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్