
మీసేవ.. సర్వర్ డౌన్
● బారులుదీరిన దరఖాస్తుదారులు
వెంకటాపురం (కె) : రాజీవ్ యువ వికాస పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు రాగా మీసేవ కేంద్రంలో శుక్రవారం సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. దీంతో దరఖాస్తు దారులు ఇబ్బందులు పడ్డారు. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సోమవారం ఒక్కరోజే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో దరఖాస్తులు చేస్తుడడంతో కేంద్రం నిర్వాహకులు రాత్రి 9గంటల వరకు సర్వర్ పని చేస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని చెబుతున్నారు. చేసేదేమి లేక పూర్తి చేసిన అన్ని పత్రాలను ఇచ్చి వెళ్లాలని మీసేవ సిబ్బంది తెలుపుతున్నారు. దరఖాస్తుకు రెండ్రోజుల గడువు ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుకు గడువు పెంచాలని వారు కోరుతున్నారు.