● ‘పది’ ఫెయిలైన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్న అధికారులు
● సెలవులున్నా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు
● ఉమ్మడి జిల్లాలో ఫెయిలైన వారు 9,092 మంది
● అత్యధికంగా గణితం, సైన్స్‌లోనే అనుత్తీర్ణత
● ఎక్కువ మంది ఉన్నచోట ప్రత్యక్షంగా.. తక్కువ ఉన్నచోట ఆన్‌లైన్‌లో తరగతులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలపై జిల్లా విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులను మరోసారి గట్టెక్కించేందుకు ఉమ్మడి జిల్లాలోని విద్యాశాఖ అదికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఫెయిలైన వారిలో ఎక్కువగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులు ఉన్నాయి. దీంతో ఆయా సబ్జెక్టులను బోధించేలా ఉపాధ్యాయులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో తక్కువగా మంది విద్యార్థులు ఫెయిలైన వారు ఉండటంతో వారికి ఆన్‌లైన్‌లో బోధన చేస్తున్నారు.
ప్రత్యేక దృష్టిపెట్టాం..
జిల్లాలో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీలో ఉత్తీర్ణత సాధించేలా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పాఠశాలల్లో విద్యార్థులకు తరగతులు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించాం. ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్ తరగతుల ద్వారా అయినా తరగతులు బోధించేలా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెల 14 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమయానికి వారిని సిద్ధం చేస్తాం. – గోవిందరాజులు, డీఈఓ,
నాగర్‌కర్నూల్, వనపర్తి
బాధ్యతగా నిర్వహిస్తున్నాం..
ఫెయిలైన విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు మా పరిధిలోని పాఠశాలల్లో తరగతుల్లో ఇంగ్లిష్, గణితం బోధిస్తున్నాం. వేసవి సెలవులు అయినప్పటికీ ఉపాధ్యాయులు బాధ్యతగా విద్యార్థులకు నష్టం జరగకూడదని తరగతులు నిర్వహిస్తున్నాం. అందరూ పాస్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
– జగదీష్, హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ కొల్లూర్, నవాబుపేట మండలం
జిల్లా పరీక్షలకు పాసైన ఫెయిలైన
హాజరైన వారు వారు వారు
మహబూబ్‌నగర్ 12,503 8,909 3,594
నాగర్‌కర్నూల్ 10,545 9,582 963
నారాయణపేట 7,541 5,661 1,880
జోగుళాంబ గద్వాల 7,175 5,790 1,385
వనపర్తి 7,028 5,758 1,270
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 14 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రక టించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారు 9,092 మంది ఉన్నారు. ఇందులో అత్యధికంగా మంది ఫెయిల్ అయిన చో ట ఉపాధ్యాయులు విద్యార్థులను పాస్ చేసే విధంగా తరగతులు తీసుకుంటున్నారు. తరగతులకు హా జరు కాలేని ఉపాధ్యాయులు విద్యార్థులను ఆన్‌లైన్, వాట్సప్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ తరగతులు బోధిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల విద్యార్థులకు తరగతులు బోధించేందుకు కొంతమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది. అన్ని జిల్లాల్లోని పాఠశాలల్లో తరగతులు తీసుకున్న ఉపాధ్యాయులు ప్రతి రోజు ఫొటోలను వాట్సప్ ద్వారా పంపించాలని ఆదేశిస్తున్నా పలువురు పట్టించుకోవడం లేదు.
ఉమ్మడి జిల్లాలో 9,092 మంది..
Comments
Please login to add a commentAdd a comment