అన్నిరంగాల్లో మహిళల ముందంజ
నాగర్‌కర్నూల్ క్రైం: మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని జిల్లా జడ్జి రాజేష్‌బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని, ప్రతి పురుషుడి విజయం వెనక సీ్త్ర కృషి ఉంటుందన్నారు. పూర్వపు రోజుల్లో సీ్త్రలు ఇంటికే పరిమితం అయ్యేవారని, ప్రస్తుతం మహిళలు చదువులోనే కాకుండా రాజకీయాలు, వ్యాపారం, ఇతర అన్నిరంగాల్లో మగవారికి ధీటుగా ముందడుగు వేస్తున్నారని కొనియాడారు. సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ సీ్త్రలు అన్నిరంగాల్లో రాణించాలంటే కుటుంబ సభ్యుల సహకారం అందించాలన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్నిరకాల హక్కులు కల్పించడం జరిగిందన్నారు. మహిళలు నిర్భయంగా వారికి నచ్చిన రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి పిలుపునిచ్చారు. అనంతరం న్యాయ శాఖ మహిళా ఉద్యోగులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ జూనియర్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి పర్వత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment