సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో ఆశావహులకు బీఆర్‌ఎస్ మొండిచేయి చూపింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కొంత కాలంగా ఆశావహులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి తమకు టికెట్ ఇస్తారని, పెద్దల ఆశీస్సులు ఉన్నాయంటూ చెప్పుకున్నారు. కొందరు ఫౌండేషన్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లగా, మరికొందరు సాధారణంగానే ప్రయత్నాలు చేసుకున్నారు. అయినా సోమవారం ప్రకటించిన జాబితాలో సిట్టింగ్‌లకే టికెట్లను కేటాయించడంతో ఆశావహులకు నిరాశ తప్పలేదు.
► నల్లగొండలో కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ఆర్‌కేఎస్ ఫౌండేషన్ పేరుతో కొంత కాలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి కూడా ఈసారి అవకాశం ఇస్తే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. సోమవారం ప్రకటించిన జాబితాలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికే స్థానం కల్పించారు.
► మునుగోడు నియోజకవర్గంలోనూ కర్నాటి విద్యాసాగర్, బోళ్ల శివశంకర్, నారబోయిన రవి టికెట్ ఆశించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి మునుగోడు టికెట్ ఆశించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయినా, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్నే కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో అక్కడ ఆశావహులకు భంగపాటు తప్పలేదు.
► నాగార్జునసాగర్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. బుసిరెడ్డి ఫౌండేషన్ పేరుతో బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు టికెట్ ఆశించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి మాత్రం నోముల భగత్‌కే టికెట్ ఖరారు చేశారు.
► దేవరకొండలో దేవేందర్ నాయక్, కోదాడలో శశిధర్‌రెడ్డికి కూడా భంగపాటు తప్పలేదు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెలే వేముల వీరేశం కూడా టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా నిరాశే మిగిలింది.
► టికెట్ దక్కకపోవడంతో భవిష్యత్‌పై సమాలోచనలు
Comments
Please login to add a commentAdd a comment