గొల్లగట్టుకు వెళ్లొద్దాం
నేటి నుంచి దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి జాతర
సర్వం సిద్ధం చేసిన
యంత్రాంగం
రాత్రి కేసారం నుంచి
పెద్దగట్టుకు రానున్న దేవరపెట్టె
గంపల ప్రదక్షిణతో
ప్రారంభం
పెద్దగట్టు ఆలయంలో
ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ పూజలు
చివ్వెంల(సూర్యాపేట): మండలంలోని దురాజ్‌పల్లిలో గల శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) దేవస్థానాన్ని శనివారం రాష్ట్ర భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించకున్నారు. ఈ సందదర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.
మరకతోరణం ఊరేగింపులో మాజీ
ఎంపీ బడుగుల, వేణారెడ్డి తదితరులు
చివ్వెంల(సూర్యాపేట): రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ జాతర ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభం కానుంది. రాత్రి సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి దేవరపెట్టెను పెద్దగట్టుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. దేవరపెట్టెలో గొల్ల లు ఆరాధించే శ్రీ లింగమంతుల స్వామితో పాటు 33మంది దేవతల గణం ఉంటుంది. సుమారు 400 ఏళ్లుగా రెండేళ్లకు ఒకసారి జరుగుతున్న ఈ జాతరకు మనరాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఆలయ సంప్రోక్షణ పూర్తి
ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేయించి, సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. మెట్లు, ప్రవేశద్వారానికి రంగుల వేశారు. తలనీలాలు, టెంకాయల వేలంపాటలు పూర్తి చేశారు. భక్తుల రవాణాకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది. తాగునీటి వసతితోపాటు, చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. జాతరలో వివిధ రకాల దుకాణాలతోపాటు వినోద శాలలు వెలిశాయి.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
జాతరలో పారిశుద్ధ్యపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. జాతరను 8 జోన్లుగా విభజించారు. 7 ప్రాంతాల్లో శాశ్వత మరుగుదొడ్లు, 24 చోట్ల మహిళలకు, 48 చోట్ల పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు మూడు షిఫ్ట్‌ల ప్రకారం ఒక్కో షిఫ్ట్‌కు 130 మంది చొప్పున 390 మంది కార్మికులు పారిశుద్ధ్య విధుల్లో పాల్గొనున్నారు. షిఫ్ట్‌కు నాలుగు ట్రాక్టర్ల ద్వారా చెత్తాచెదారం తొలగించనున్నారు. ఇందుకు 19మంది సూపర్‌వైజర్లు, 12 మంది జవాన్లను నియమించారు. రాత్రి పూట వెలుగులు విరజిమ్మేలా ఎల్‌ఈడీ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం నాలుగు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. కోనేరులో శివుని విగ్రహం ప్రతిష్టించారు.
ఏర్పాట్ల పరిశీలన
జాతరలో భక్తుల కోసం కల్పించిన సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, సూర్యాపేట ఆర్‌డీఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణయ్య పర్యవేక్షించారు. ఈ జాతరకు 30 లక్షల మంది వరకు భక్తులు తరలిరానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
విద్యుత్ వెలుగుల్లో దురాజ్‌పల్లి
శ్రీలింగమంతుల స్వామి ఆలయం
సూర్యాపేట టౌన్: దురాజ్‌పల్లిలో ఆదివారం నుంచి ఐదు రోజులపాటు జరగనున్న శ్రీలింగమంతుల స్వామి జాతర మహోత్సవానికి శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్ల బజార్ నుంచి స్వామివారి మకర తోరణం భారీ ఊరేగింపు నడుమ పెద్దగట్టుకు తరలి వెళ్లింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పెద్దగట్టు జాతరను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. శ్రీలింగమంతుల స్వామి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, కక్కిరేణి శ్రీనివాస్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అంజాద్ అలీ, కోడి శివయాదవ్, హరీష్ యాదవ్, బత్తుల సాయి, వల్లపు రఘువీర్ యాదవ్, కోడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గొల్లగట్టుకు వెళ్లొద్దాం
గొల్లగట్టుకు వెళ్లొద్దాం
గొల్లగట్టుకు వెళ్లొద్దాం
గొల్లగట్టుకు వెళ్లొద్దాం
గొల్లగట్టుకు వెళ్లొద్దాం
Comments
Please login to add a commentAdd a comment