
చేనేత సహకార సంఘాల గడుపు పెంపు
జూలై 20 వరకు గడువు పెంపు
చేనేత సహకార సంఘాలకు నియమించిన పర్సన్ ఇన్‌చార్జిల గడువు మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని చేనేత సహకార సంఘాల పర్సన్ ఇన్‌చార్జిల పదవీకాలం జనవరి 21కి ముగిసింది. దీంతో జూలై 20 వరకు గడువు పెంచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుడికి అందేలా కృషి చేస్తున్నాం. – పద్మ, రాష్ట్ర చేనేత,
జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్
సాధకబాధకాలు చెప్పే అవకాశం లేదు
చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చేనేత కార్మికుడే సంఘానికి చైర్మన్‌గా ఉంటే మా సాధకబాధకాలు తెలిసి మాకేం అవసరమో సమకూరుస్తారు. కానీ అధికారులతో అంత చొరవగా మాట్లాడలేం, మా సమస్యలను చెప్పుకోలేం. వెంటనే సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం.
– దుద్యాల పాపయ్య, చేనేత సహకార సంఘం సభ్యుడు, భూదాన్‌పోచంపల్లి
భూదాన్‌పోచంపల్లి: చేనేత సహకార సంఘాలకు పర్సన్ ఇన్‌చార్జిలనే తిరిగి కొనసాగిస్తూ ప్రభుత్వం మరో 6 నెలల గడువును పొడిగించింది. పర్సన్ ఇన్‌చార్జిల పదవీకాలం గత నెల 21న ముగిసింది. దీంతో 2025 జూలై 20 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడేళ్లుగా ఎన్నికలు లేవు..
చేనేత సహకార సంఘాలకు గత ఏడేళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లాలో 2013 ఫిబ్రవరిలో చేనేత సహకార సంఘాలకు చివరగా ఎన్నికలు జరిగాయి. 2018 ఫిబ్రవరిలో పాలకవర్గాలకు ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యింది. కానీ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌చార్జిలను నియమించి, వారితోనే పాలన నెట్టుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుందని చేనేత వర్గాలంతా ఆశపడ్డారు. చేనేత నాయకులు పలుమార్లు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కానీ ప్రభుత్వం మరోసారి పర్సన్ ఇన్‌చార్జిలనే కొనసాగిస్తూ గడువు పొడిగించింది.
13 దఫాలుగా గడువు పొడిగిస్తూ...
2018లో చేనేత సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత నియమించిన పర్సన్ ఇన్‌చార్జిల పదవీకాలాన్ని ప్రతి ఆరు నెలలకొకసారి గడువు పొడిగించుకొంటూ ఈ ఏడేళ్ల కాలంలో 13 దఫాలుగా పొడిగించారు.
ఉమ్మడి జిల్లాలో సంఘాలు ఇలా...
ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాలు, పవర్‌లూమ్‌లు కలిపి మొత్తం 84 ఉన్నాయి. ఇందులో యాదాద్రి జిల్లాలోనే అత్యధికంగా 43 సంఘాలు ఉండగా 12 క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. వీటిలో మొత్తం 18,882 మంది చేనేత కార్మికులు సంఘం సభ్యులుగా ఉన్నారు. అలాగే నల్లగొండ జిల్లాలో 25 సహాకార సంఘాలు, 5 పవర్‌లూమ్ సంఘాలు ఉండగా, ఇందులో మొత్తం 6588 మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 3 సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. 330 మంది సంఘ సభ్యులున్నారు.
అచేతనంగా సంఘాలు
ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌చార్జిలను నియమించడం వల్ల చేనేత సహకార సంఘాలు కార్మికులకు చేతినిండా పనికల్పించలేకపోతున్నాయి. పర్సన్ ఇన్‌చార్జిలు వెంటనే కార్మికులకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోలేకపోతుండడంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడంలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. ముఖ్యంగా నూలు, రంగులు, రసాయనాలు తదితర ముడిసరుకు సకాలంలో అందించలేకపోతున్నారు. దీంతో చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద కూలీ మగ్గాలపై పనిచేస్తున్నారు. చేనేత సహకార సంఘాలలో అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఒక్కో చేనేత సహకార సంఘంలోనే కోటి 10లక్షల విలువైన చేనేత వస్త్రాల స్టాక్ నిల్వ ఉంది. భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, కొయ్యలగూడెం, భువనగిరి తదితర సంఘాలకు ఏడాదికి 2కోట్లకు పైగా వస్త్రాలను తయారు చేయించే సామర్థ్యం ఉంది. కానీ అందుకనుగుణంగా టెస్కో వస్త్రాలను కూడా కొనడంలేదు. ఒకవేళ అరకొర వస్త్రాలను కొనుగోలు చేసినా సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. ఎన్నికలు నిర్వహిస్తే సమస్యలన్నింటికీ చెక్ పడుతుందని కార్మికులు పేర్కొంటున్నారు.
ఎన్నికలు నిర్వహించాలి
చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘం కన్నతల్లిలాంటిది. గత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఎన్నికలు నిర్వహించకుండా సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ వ్యవస్థను పటిష్టం చేయాలంటే తక్షణమే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని నియమించాలి. పాలకవర్గం ఉంటే కార్మికులకు కావల్సిన అవసరాలను తీరుస్తుంది.
– కర్నాటి పురుషోత్తంం, తెలంగాణ చేనేత
జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు
ఫ మరో 6 నెలలు పెంచుతూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ
ఫ పర్సన్ ఇన్‌చార్జిలకే బాధ్యతలు
ఫ ఏడేళ్లుగా పాలకవర్గాలు లేక కునారిల్లుతున్న చేనేత సహకార సంఘాలు

చేనేత సహకార సంఘాల గడుపు పెంపు

చేనేత సహకార సంఘాల గడుపు పెంపు

చేనేత సహకార సంఘాల గడుపు పెంపు
Comments
Please login to add a commentAdd a comment