
హైవేపై వాహనాల దారి మళ్లింపు
సూర్యాపేట టౌన్, కోదాడ రూరల్, నార్కట్‌పల్లి: పెద్దగట్టు జాతర దృష్ట్యా విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దారిమళ్లిస్తున్నారు.
● నార్కట్‌పల్లి వద్ద: హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద మళ్లించి నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌గర్, కోదాడ మీదుగా విజయవాడకు పంపిస్తున్నారు.
● కోదాడ వద్ద : విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను జాతీయ రహదారి 65పై కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ ఫ్‌లైఓవర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను కిందికి దింపి హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి బైపాస్ మీదుగా హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఎస్‌ఐలు, 12 మంది సిబ్బంది షిఫ్టుల ప్రకారం పనిచేస్తున్నారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలీసులు రూట్‌మ్యాప్‌ను వివరిస్తున్నారు.
● ఖమ్మం వెళ్లే వాహనాలను..: హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365బీబీ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక్కడ షిఫ్ట్‌కు 8 మంది చొప్పున 16 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
● కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం వద్ద నుంచి సూర్యాపేట పట్టణానికి పంపుతున్నారు. ఇక్కడ కూడా షిఫ్ట్‌కు 8 మంది చొప్పున 16 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
● సూర్యాపేట పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రజా రవాణా వాహనాలు కుడకుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజీ నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజీ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపునకు పంపిస్తున్నారు.

హైవేపై వాహనాల దారి మళ్లింపు
Comments
Please login to add a commentAdd a comment