
కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
అర్వపల్లి: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 30 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి మెరుగు దేవయ్య తన గొర్రెలను శనివారం రాత్రి ఇంటి సమీపంలోని దొడ్డిలోకి తోలాడు. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు గుంపుగా గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 30 గొర్రెలు మృతిచెందాయి. ఆదివారం ఉదయం దేవయ్య గొర్రెల దొడ్డి వద్దకు వచ్చి చూడగా గొర్రెలు చనిపోయి ఉండడంతో లబోదిబోమంటూ స్థానికులకు విషయం తెలియజేశాడు. సుమారు రూ.3లక్షలకు పైగానే నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.
అదృశ్యమైన వృద్ధురాలు మృతి
నూతనకల్: అదృశ్యమైన వృద్ధురాలు ఆదివారం మృతిచెందింది. ఎస్‌ఐ మహేంద్రనాఽథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండల కేంద్రంలోని హరిజన కాలనీకి చెందిన ఇరుగు నర్సమ్మ(75)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ నెల 13వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఆదివారం హరిజన కాలనీ పక్కనే బావిలో నర్సమ్మ మృతదేహం తేలిఉండటం స్థానికులు గమనించి వెలికితీశారు. మృతురాలి కుమారుడు సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బెల్ట్ షాపులు నిర్వహించొద్దు
ఫ చిట్యాల మండలం ఏపూరులో మరోసారి మహిళల నిరసన
చిట్యాల: మండలంలోని ఏపూరులో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించొద్దని గ్రామ మహిళలు ఈ నెల 13న గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అయినప్పటికీ మద్యం అమ్మకాలు కొనసాగుతుండటంతో ఆదివారం మరోసారి మహిళలంతా కలిసి ర్యాలీ నిర్వహించి, గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామంలో బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయిస్తే రూ.లక్ష, బెల్ట్ షాపుల్లో మద్యం తాగి పట్టుబడిన వారు రూ.20,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించాలని షాపుల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు, ఎకై ్సజ్ పోలీసులు, ప్రజాప్రతినిధులు సహకరించి ఏపూరులో బెల్ట్ షాపుల నిషేధానికి సహకరించాలని గ్రామ మహిళలు కోరుతున్నారు.

కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి
Comments
Please login to add a commentAdd a comment