ఫ నలుగురికి తీవ్ర గాయాలు
నకిరేకల్: మృతదేహాన్ని తీసుకొస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నకిరేకల్ మండలం మర్రూర్ శివారులో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రూర్ గ్రామానికి చెందిన లింగమ్మ తన పెద్ద కుమార్తె ఊరైన కట్టంగూర్ మండలం అయిటిపాములలో అనారోగ్యంతో శనివారం మృతిచెందింది. లింగమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అయిటిపాముల నుంచి మర్రూర్‌కు ఆటోలో శనివారం రాత్రి తీసుకొస్తుండగా.. మర్రూర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో తిప్పర్తి నుంచి వస్తున్న ట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కొత్తపల్లి లచ్చయ్య, బత్తుల సైదులు, రమణ, లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లింగమ్మ మృతదేహాన్ని మర్రూర్ తరలించి ఆదివారం అంత్యక్రియలు జరిపించారు. మృతురాలి మనవడు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment