నల్లగొండ టూటౌన్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17న ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ ఎదుట మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment