లింగమయ్యా.. దీవించయా్య..
విద్యుత్ వెలుగుల్లో లింగమంతులస్వామి ఆలయ పరిసరాలు
వైభవంగా గొల్లగట్టు
జాతర ప్రారంభం
ఫ కేసారంలో దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు
ఫ అర్ధరాత్రి కాలినడకన పెట్టెను గట్టుకు చేర్చిన భక్తులు
ఫ ఆకట్టుకున్న మందగంపల ప్రదక్షిణ
చివ్వెంల/సూర్యాపేట టౌన్: గజ్జెల లాగుల గలగలలు, కటార్ల విన్యాసాలు, డప్పు చప్ప్పుళ్లు, భక్తుల పూనకాల నడుమ లింగా.. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మార్మోగింది. మేడారం జాతర తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి జాతర (పెద్దగట్టు జాతర) ఆదివారం ప్రారంభమైంది. యాదవులు సంప్రదాయ దుస్తులు ధరించి భేరీల చప్పుళ్లతో సందడి చేశారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలతో పాటు ఇతర వాహనాల్లో యాదవులు, భక్తులు ఆదివారం అర్ధరాత్రికే గట్టుకు చేరుకున్నారు.
అర్ధరాత్రి గట్టుకు చేరిన దేవరపెట్టె..
ముందుగా సూర్యాపేట మండలం కేసారంలో ఆదివారం రాత్రి దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గొర్ల గన్నారెడ్డి ఇంటి నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, మెంతబోయిన లింగస్వామి ఇంటి నుంచి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి దేవతామూర్తులకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి పూజలు చేశారు. అనంతరం యాదవులు, ఇతర కులాలవారు కాలినడకన దేవరపెట్టెను ఊరేగింపుగా పెద్దగట్టు వద్దకు చేర్చారు. అనంతరం ఆలయానికి పడమటి వైపుఉన్న మెట్ల ద్వారా గొల్లగట్టుపైకి చేరి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. మెంతబోయిన, మున్న, గొర్ల వంశస్తులు దేవరపెట్టెకు పూజలు నిర్వహించారు.
ఆలయం చుట్టూ మందగంపల ప్రదక్షిణ
మున్న మెంతబోయిన వంశస్తులకు చెందిన ప్రతి ఇంటి నుంచి మహిళలు మందగంపలతో జాతరకు తరలివచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.
నేడు చౌడమ్మకు బోనాలు
జాతరలో రెండో రోజు సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా మెంతబోయిన వంశస్తులు తెల్చిన తొలి గొర్రె (తల్లి గొర్రె), మున్న వంశీయులు తెచ్చిన బద్దెపాల గొర్రె, రెడ్డిగొర్ల వంశీయులు తెచ్చిన వర్ధ గొర్రెను అమ్మవారి ముందు జడత పడుతారు. అనంతరం అమ్మవారికి బలి ఇస్తారు.
లింగమయ్యా.. దీవించయా్య..
లింగమయ్యా.. దీవించయా్య..
లింగమయ్యా.. దీవించయా్య..
లింగమయ్యా.. దీవించయా్య..
లింగమయ్యా.. దీవించయా్య..
Comments
Please login to add a commentAdd a comment