నేడు పాఠశాలలకు సెలవు
నల్లగొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దగట్టు (దురాజ్‌పల్లి) జాతర సందర్భంగా లోకల్ హాలీడే ప్రకటించినట్లు పేర్కొన్నారు.
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
మర్రిగూడ: పదో తరగతిలో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్‌రావు అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులపై ఆయన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బాలరాజు, యాదయ్య, శ్రీరాములు ఉన్నారు.
బుద్ధవనం సందర్శించిన జిల్లా అటవీశాఖ అధికారి
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ఆదివారం జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, ఆయన మిత్ర బృందం సందర్శించారు. ఈ సందర్బంగా బుద్ధవనంలోని బుద్ధ చరిత వనం, ధ్యానవనం, జాతకవనం, స్థూవనాలను సందర్శించారు. బుద్ధవనంలోని మహాస్థూపం ధ్యానమందిరంలో ధ్యానం చేశారు.
నారసింహుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. అనంతరం గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
నేడు పాఠశాలలకు సెలవు
నేడు పాఠశాలలకు సెలవు
Comments
Please login to add a commentAdd a comment