కిక్కిరిసిన చేపల మార్కెట్
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో గల చేపల మార్కెట్ ఆదివారం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ షాపుల వద్ద కొనుగోళ్లు జరగక వెలవెలబోగా.. చేపల మార్కెట్ వద్ద ప్రజలు ఎగబడి చేపల కొనుగోళ్లు చేశారు. కేజీ రవ్వ రూ.230 నుంచి రూ.250 వరకు, పాంప్‌లెట్స్ పెద్ద సైజ్ కేజీ రూ.100, కొర్రమీను కేజీ రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూసీ రోడ్డు చేపల కొనుగోలుదారులతో రద్దీగా కనిపించింది.
చేపలు కొనుగోలు చేస్తున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment