తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు ఎవరూ చెరిపేయలేరు
నల్లగొండ టూటౌన్: తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేయడం ఎవరి తరం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద, బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అక్కడ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. 15 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నల్ల గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్‌యాదవ్, బొర్ర సుధాకర్, మందడి సైదిరెడ్డి, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, కరీంపాషా తదితరులు పాల్గొన్నారు.
దేశానికి స్ఫూర్తి ప్రదాత కేసీఆర్
మిర్యాలగూడ : దశాబ్దాల పాటు వెనుకబాటుకు గురైన తెలంగాణను అన్నివిధాలుగా అభివృద్ధి చేసి మాజీ సీఎం కేసీఆర్ దేశానికి స్పూర్తి ప్రదాత అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి జగదీష్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, బైరం సంపత్, ఆంగోతు హాతీరాంనాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, లావూరి మేగ్యానాయక్, ఎండీ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment