జాతరకు వచ్చే భక్తులకు కేరాఫ్ అడ్రస్‌గా మర్రిచెట్టు నిలిచింది. ప్రధాన ద్వారం, గట్టు పైకి వెళ్లే వారు మర్రిచెట్టు నీడలో భక్తులు సేదతీరారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సైతం ఇక్కడి నుంచి జాతరను పర్యవేక్షించారు. తప్పిపోయిన వారిని గుర్తించడం, వివిధ శాఖల అధికారులు సైతం ఇక్కడికే వచ్చి కలుసుకోవడం గమనార్హం. జాతరలో తప్పిపోయిన వారికోసం మర్రిచెట్టు వద్ద మైక్ అనౌన్స్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు తప్పిపోతే మర్రిచెట్టు వద్దకు తీసుకురావాలని మైక్‌లో అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. కొందరు భక్తులు తమకు సంబంధించిన వ్యక్తి కనిపించడం లేదని బండి దగ్గరికి రావాలని.. మర్రిచెట్టు వద్దకు రావాలని... గుట్టపైకి రావాలంటూ వచ్చి అధికారులను విసిగించారు. దీంతో అధికారులు భక్తుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కేవలం చిన్నపిల్లలు తప్పిపోతేనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, ఇలా అధికారులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని పదేపదే సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment