యాదగిరిగుట్టలో వైభవంగా గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని బుధవారం భక్తులు, ఆలయాధికారులు, స్థానికులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 5గంటలకు కొండ కింద గల వైకుంఠద్వారం వద్ద ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తిలు ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అంతకుముందు కూచిపూడి, భరటనాట్యంతో కళాకారులు భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయంలో స్వాతి హోమాన్ని నిర్వహించి, స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment