పెద్దగట్టు జాతరలో పోలీస్ బందోబస్తు భేష్
సూర్యాపేటటౌన్: దురాజ్‌పల్లి లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతరలో పోలీసులు బందోబస్తు పకడ్బందీగా నిర్వహిస్తున్నారని మల్టీజోన్–2 ఐజీ వి. సత్యనారాయణ అన్నారు. బుధవారం లింగమంతులస్వామిని ఆయన దర్శంచుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారని కితాబిచ్చారు. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జాతర పరిసరాలను పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి జాతరలో దొంగతనాలు జరగకుండా నివారించారని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపునకు సహకరించిన వాహనదారులు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐలు రాజశేఖర్, వీరరాఘవులు, స్థానిక ఎస్‌ఐ మహేశ్వర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఫ మల్టీజోన్–2 ఐజీ వి. సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment