బైక్ ట్యాంకు కవర్‌లో నుంచి రూ.2లక్షలు అపహరణ
హాలియా: బైక్ ట్యాంకు కవర్‌లో పెట్టిన రూ.2లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన హాలియా పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం తెప్పలమడుగుకు చెందిన కొండల్ బైక్‌పై బుధవారం హాలియాలోని ఎస్‌బీఐలో నగదు డ్రా చేసేందుకు వచ్చాడు. రూ.2లక్షల నగదు డ్రా చేసి కవర్‌లో పెట్టి తన బైక్ ట్యాంకు కవర్‌లో పెట్టాడు. దేవరకొండ రోడ్డులోని వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపు వద్ద బైక్‌ను నిలిపి షాపులోకి వెళ్లి వచ్చేసరి బైక్ ట్యాంకు కవర్‌లో పెట్టిన నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి నగదు చోరీ చేసి సాగర్ వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment