అడ్డగూడూరు: మండలంలోని అజీంపేట గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతోంది. అజీంపేటకు చెందిన పండుగ రాజమల్లు మృతికి అదే గ్రామానికి చెందిన భట్ట లింగయ్యనే కారణమని రాజమల్లు కుమారుడు రామస్వామి కక్ష పెంచుకున్నాడు. 2017 ెదసరా రోజు భట్ట లింగయ్య గ్రామంలో జమ్మి పూజ వద్దకు రాగా.. రామస్వామితో సహా మరో 17 మంది గ్రామస్తులతో కలిసి మూకుమ్మడిగా అతడిపై దాడి చేశారు. చికిత్స నిమిత్తం లింగయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. లింగయ్య కుమారుడు వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రామస్వామితో పాటు 17మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసు తుది విచారణలో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మూడో అదనపు జడ్జి జడ్జీ రోజారమణి 18మందికి జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. వీరిలో జక్కుల భిక్షమయ్య గతంలోనే మృతిచెందగా.. మిగతా 17 మందిని నల్లగొండ జైలుకు తరలించారు. అజీంపేటలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బుధవారం కూడా పోలీసు పికెట్ కొనసాగించినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment