జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తితో పాటు 7 నెలల పసికందు మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సుంకి సాయికుమార్(35), తన భార్య సింధూజ, కుమారుడు విరాంచ్(7 నెలలు)తో కలిసి హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సాయికుమార్ బుధవారం సాయంత్రం భార్య, కుమారుడితో పాటు తన తల్లిదండ్రులతో కలిసి పటాన్‌చెరు నుంచి కారులో సూర్యాపేటకు వెళ్తున్నాడు. అద ఏ సమయంలో నల్ల గొండలోని గోకుల్ బీఈడీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న నల్లగొండకు చెందిన జె. సందీప్‌రెడ్డి, తన భార్య పద్మతో కలిసి నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్నాడు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే సందీప్‌రెడ్డి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో వస్తున్న సాయికుమార్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్‌తో పాటు అతడి కుమారుడు విరాంచ్ అక్కడికక్కడే మృతి చెందారు. సాయికుమార్ తండ్రి వెంకన్న, తల్లి విజయ, భార్య సింధూజ తీవ్రంగా గాయపడ్డారు. జె. సందీప్‌రెడ్డి, అతడి భార్య పద్మకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్లను హైవే పక్కకు తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఐదుగురిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చౌటుప్పల్ సీఐ జి. మన్మథకుమార్ తెలిపారు.
ఫ అదుపుతప్పి ఢీకొన్న రెండు కార్లు
ఫ ఇద్దరు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
ఫ మృతుల్లో 7 నెలల పసికందు
ఫ చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం
గ్రామ స్టేజీ వద్ద ఘటన
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment