రూ.70కోట్లతో పెద్దగట్టు అభివృద్ధి చేస్తాం
చివ్వెంల: చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో గల పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయాన్ని రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం పెద్దగట్టు జాతరకు మంత్రి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దగట్టు ఆలయం వద్దకు ఘాట్ రోడ్డుతో పాటు శాశ్వత గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తామని, భక్తుల కోసం గుడి వద్ద వసతి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ కాలువలు తవ్వించారని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు త్వరలో పూర్తిచేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎప్పుడూ పెద్దగట్టు జాతరకు రాలేదని, ఇప్పుడు వచ్చి పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో ఇరవై ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ మతంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు గాని సీట్లు గాని వచ్చే పరిస్థితి లేదన్నారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట ఆలేరు, నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, ఆలయ చైర్మన్ నర్సయ్యయాదవ్ పాల్గొన్నారు.
ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ లింగమంతుల స్వామికి పూజలు
Comments
Please login to add a commentAdd a comment