మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్
రామగిరి(నల్లగొండ): సుస్థిర అభివృద్ధి సాధిస్తూ, సమస్యలను అధిమిస్తూ భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్(ఐసీఎస్‌ఎస్‌ఆర్)–హైదరాబాద్ డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐసీఎస్‌ఎస్‌ఆర్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో కళాశాల సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన ‘సుస్థిర అభివృద్ధి–భారతదేశంలో అవకాశాలు మరియు సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన నేషనల్ సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ సెమినార్లు నిర్వహించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మరొక అతిథి ప్రొఫెసర్ మల్లయ్య మాట్లాడుతూ.. ప్రపంచంలో పేదరికం, అసమానతలను అంతంచేసేలా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సుస్థిర అభివృద్ధిపె పలువురు పరిశోధనా పత్రాలను సమర్పించారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఎకనామిక్స్ హెడ్ ప్రొఫెసర్ ఫరీదా బేగం, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఆకుమార్తి నాగేశ్వరరావు, ప్రొఫెసర్ మల్లయ్య, ప్రొఫెసర్ ఎం. రాములు, బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దయాకర్, సెమినార్ కన్వీనర్ డాక్టర్ బి. మునిస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఆది మల్లేశం, కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఐసీఎస్‌ఎస్‌ఆర్–హైదరాబాద్
డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment