కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
మిర్యాలగూడ: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉందని, పేదలకు, రైతులకు, కార్మికులకు, కూలీలకు, మహిళలకు, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందన్నారు. రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, వస్కుల మట్టయ్య, కుమారస్వామి, వరికుప్పల వెంకన్న, వనం సుధాకర్, పెద్దారపు రమేష్, నజీర్, సైదమ్మ, కాశీ, ప్రతాప్, రాగసుధ, సంధ్య, సావిత్రి, వెంకన్న, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి
గాదగోని రవి
Comments
Please login to add a commentAdd a comment