ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు చేయాలి
నల్లగొండ: రైతు భరోసా ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో ఫిర్యాదుల విభా గాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె నల్లగొండ కలెక్టరేట్ నుంచి రైతు భరోసాపై జిల్లా, మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతలో భాగంగా సుమారు 12వేల ఎకరాలు వరకు వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తించామన్నారు. ఈ వివరాలను శనివారంలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించి సోమవారం ప్రజావాణిలోపు పరిష్కరించాలని ఆదేశించారు. యూరియా కోసం రైతుల ఇబ్బందులు పడకుండా సరఫరా చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జెజశ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఏఓ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్: విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలోని ఎఫ్‌సీఐ కమ్యూనిటీ హాల్‌లో ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ 45వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు. మెస్, కాస్మోటిక్ చార్జిలు, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు. ఈ సభలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.కిరణ్, ప్రతినిధులు లక్ష్మీనారాయణ, సలీం, సత్తయ్య, మల్లం మహేష్, నరేష్, కంబంపాటి శంకర్, సైదానాయక్, కుంచం కావ్య, లక్ష్మణ్, కోరె రమేష్, బుడిగె వెంకటేష్, ముస్కు రవీందర్, స్పందన, సిరి, జగన్, వీరన్న, సంపత్, సైఫ్, కిరణ్, జగదీష్, రవి, రోహిత్ పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల (అంధ, బదిర, మానసిక, శారీరక దివ్యాంగులు)కు ఉపకార వేతనాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి కేవీ.కృష్ణవేణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 శాతం అంగవైకల్యం కలిగినట్టు డాక్టర్ ధ్రువీకరణ పత్రంతోపాటు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, 2 ఫొటోలు, 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల గత సంవత్సరం మార్కుల జాబితా, పాఠశాల బ్యాంకు ఖాతా నంబర్ మొదటి పేజి జిరాక్స్ జత చేసి దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తులను మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా telanganaepass.cgg.gov.inలో సంబంధిత ప్రధానోధ్యాయుడి నుంచి సిఫారసు చేసిన కాపీతోపాటు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు.
పశుసంవర్ధక శాఖ
జేడీగా రమేష్
నల్లగొండ అగ్రికల్చర్: జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ జీవీ రమేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఈయన పదోన్నతిపై జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా రానున్నారు. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జేడీఏగా ఏడీ ఖదీర్ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల సంక్షేమానికి
కృషిచేయాలి
నల్లగొండ: విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా వసతి గృహ సంక్షేమ అధికారులు కృషిచేయాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి అన్నారు. బుధవారం నల్లగొండలోని టీఎన్జీఓ భవన్‌లో జరిగిన వసతి గృహ సంక్షేమ అధికా రుల సంఘం జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ హాస్టళ్లలో అన్నిరకాల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడతానని అన్నారు. ఈ సభలో బి.రణధీవే, శేఖర్‌రెడ్డి, ఏ.సత్యనారాయణ, సైదానాయక్, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, గామయ్య, రమ్య సుధా, అలీమ్, బాలకృష్ణ, లింగయ్య, యాదగిరి, జానీమియా, సునీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment