భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
మిర్యాలగూడ: దామరచర్ల మండలం వాడపల్లిలోని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి మహా శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె వాడపల్లిలోగల శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా–మూసీ సంగమం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఆలయానికి మహాశివరాత్రికి వచ్చే భక్తుల కోసం షవర్‌బాత్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. అనంతరం ఆమె స్థానిక కేజీబీవీ పాఠశాల, మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ పూజిత ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, తహసీల్దార్ జవహర్‌లాల్, ఆలయ ఏఈ జ్యోతి, అనువంశిక ధర్మకర్త సిద్ధయ్య, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment