చోరీ కేసును ఛేదించిన పోలీసులు
నల్లగొండ: ఇటీవల నార్కట్‌పల్లి శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవే పక్కన హోటల్ ముందు ఆగిన ట్రావెల్స్ బస్సులో నుంచి చోరీ చేసిన రూ.25 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నో దొంగతనాలను పాల్పడిన గ్యాంగ్‌స్టర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తన కార్యాలయంలో విలేకరుల వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు మౌరి టెక్ సంస్థ యాజమాని దామోదర్‌డ్డికి సంబంధించిన వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన రూ.25లక్షలను తీసుకుని చైన్నె నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెవెల్స్ బస్సులో బయల్దేరాడు. నార్కట్‌పల్లి శివారులో హైవే పక్కన పూజిత హోటల్ వద్ద అల్పాహరం కోసం బస్సును డ్రైవర్ ఆపాడు. ఆ సమయంలో వెంకటేశ్వర్లు డబ్బులు ఉన్న బ్యాగును బస్సులోనే ఉంచి మూత్రవిసర్జన చేసేందుకు కిందకు దిగాడు. అతడు తిరిగి బస్సులోకి వచ్చేసరికి నగదు ఉన్న బ్యాగు కనిపించలేదు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు సీసీఎస్ బృందాలను ఏర్పాటు చేసి వారిని సమన్వయం చేస్తూ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బ్యాగు దొంగిలించిన వ్యక్తి కారులో వెళ్లినట్లు గుర్తించారు. కారులోని వ్యక్తుల ఫొటోల ఆధారంగా వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం మన్వర్ తాలుకా కేద్వా జాగీర్‌లోని రాళ్లమండల్‌కు చెందిన ధార్ గ్యాంగ్ లీడర్ మమ్మద్ అష్రఫ్‌ఖాన్ ముల్తానీ షేక్, లైట్ ఖాన్, అక్రం ఖాన్, మహబూబ్‌ఖాన్‌గా గుర్తించారు. దీంతో పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో నిందితుల ఇళ్లపై దాడులు చేయగా అందులో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ప్రధాన నిందితుడిగా ఉన్న మహ్మద్ అష్రఫ్‌ఖాన్‌ను పట్టుకున్నారు. అతడి ఇంట్లో బస్సులో నుంచి దొంగిలించిన నగదుతో పాటు కర్ణాటకకు చెందిన కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి ఇక్కడకు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్, సీసీఎస్ ఎస్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ నార్కట్‌పల్లిలో ప్రైవేట్ బస్సులో నుంచి దొంగిలించిన రూ.25లక్షలు రికవరీ
ఫ గ్యాంగ్‌స్టర్ మమ్మద్ అష్రఫ్ ఖాన్ అరెస్ట్
ఫ రిమాండ్‌కు తరలింపు
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment