మెరుగైన వైద్య సేవలతోనే మంచి గుర్తింపు
ఖమ్మం వైద్యవిభాగం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా ఆస్పత్రులకు మంచి గుర్తింపు లభిస్తుందని పలువురు వైద్యులు అన్నారు. ఖమ్మం నెహ్రూనగర్‌లోని అఖిల కంటి ఆస్పత్రి ఏడో వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించగా డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఓపీ చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అఖిల మాట్లాడుతూ.. నెలలు నిండకుండా జన్మించిన పిల్లల్లో రెటీనా సంబంధిత సమస్యలు ఎదురైతే వైద్యం అందించడం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ మాధవి, మేనేజింగ్ డైరెక్టర్ కుతుంబాక మధుతో పాటు డాక్టర్ సమత, శ్రీధర్, సతీష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా క్రిష్ణానాయక్
మఠంపల్లి: మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాకు చెందిన హైకోర్టు అడ్వకేట్ భూక్యా క్రిష్ణానాయక్ హైకోర్టులో చేనేత వస్త్ర పరిశ్రమ సంస్థకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రంఅందుకున్నట్లు గురువారం ఆయన పేర్కొన్నారు. కొంతకాలం సంగారెడ్డిలోని న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా ఆయన పనిచేశారు. క్రిష్ణానాయక్‌ను పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు అభినందించారు.
జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్– విజయవాడ హైవేపై ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. జాతర గురువారం ముగియడంతో నార్కట్‌పల్లి, కోదాడ, టేకుమట్ల, బీబీగూడెం, రాఘవపురం గ్రామ స్టేజీ వద్ద ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసి బారికేడ్లు తొలగించారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు యధాతథంగా వెళ్లవచ్చని సూచించారు.
మెరుగైన వైద్య సేవలతోనే మంచి గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment