పొలాల్లో గురుకుల విద్యార్థుల స్నానాలు
చిలుకూరు: చిలుకూరు మండలం నారాయణపురం గుట్టలో గల అక్షర పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో నీటి వసతి సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల పొలాల్లోని బావులు, బోర్ల వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఈ గురుకుల పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉండగా.. గత వారం రోజులుగా 300 మందికి పైగా విద్యార్థులు చుట్టుపక్కల రైతుల పొలాల వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఇది గమనించిన రైతులు బావుల వద్ద గల విద్యుత్ మోటార్ల ఫ్యూజులు దాచుకొని వెళ్లినప్పటికీ, విద్యార్థులు స్వయంగా ఫ్యూజులు పెట్టుకొని మోటార్లు ఆన్ చేసుకుని స్నానాలు చేస్తున్నారు. తమ పొలాల వద్ద స్నానాలు చేయొద్దని చెప్పినా విద్యార్థులు వినకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని విద్యార్థులను కర్రలతో వెంబడించడంతో పరారైనట్లు రైతులు తెలిపారు. ఈ విషయాన్ని గురుకుల పాఠశాల సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నానాలు చేసే క్రమంలో విద్యార్థులు వరి పొలాలు మొత్తం తొక్కుతున్నారని, పొలాల్లోనే మూత్రవిసర్జన చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు బూర లక్ష్మీనారాయణ, కొండా సైదయ్య, కోటిరెడ్డి, బూర మల్లయ్య పేర్కొన్నారు.
ఫ గురుకుల పాఠశాలలో నీటి వసతి సక్రమంగా లేకపోవడంతో
బావుల వద్దకు వెళ్తున్న విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment