స్వర్ణగిరిలో ఘనంగా ధ్వజారోహణం
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ఉదయం వైనతేయహవనం, ధ్వజారో హణం, అగ్నిప్రతిష్ట, మూర్తి కుంభారాధన, పల్లకీ సేవ, చిన్న శేషవాహనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం దేవతాహ్వనం, పెద్ద శేషవాహనసేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో త్రిదండి అహోబిలం రామానుజ జీయర్‌స్వామి, శ్రీరంగం ఆలయ ప్రథమ ఆచార్యులు శ్రీ పరశరలక్ష్మీ నృసింహ భట్టర్ స్వామి పాల్గొన్నారు. శ్రీరంగం నుంచి తెచ్చిన శేష వస్త్రం, మాల అభయహస్తంను ఆలయ వ్యవస్థాపకుడు మానేపల్లి రామారావుకు అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థపక ధర్మకర్తలు మానేపల్లి మురళీకృష్ణ, గోపికృష్ణ, ప్రధాన అర్చకుడు శ్రవణ్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
స్వర్ణగిరిలో ఘనంగా ధ్వజారోహణం
Comments
Please login to add a commentAdd a comment