వ్యవసాయాధికారుల పాత్ర కీలకం
త్రిపురారం: వివిధ రకాల పంటల సాగులో రైతులను చైతన్యం చేయడంలో వ్యవసాయ అధికారుల పాత్ర కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం త్రిపురారం మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులకు అధిక సాంద్రత పత్తి సాగు, వివిధ రకాల పంటల సాగు పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, చీడ పీడల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. వరి పంట పైనే ఆధారపడకుండా పంట మార్పిడి చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు పంటల సాగులో రసాయన ఎరువులు అధికంగా వాడకుండా చూసుకోవాలన్నారు. అనంతరం కేవీకేలో గొర్రెలు, కోళ్లు, ఆవుల పెంపకం షెడ్లను పరిశీలించారు. వేరుశనగ పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ తోటల పెంచేలా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పామ్ తోటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీల గురించి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు, డాక్టర్ లింగయ్య, డాక్టర్ రాజాగౌడ్, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఫ నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment