పెళ్లింట విషాదం
ఫ పందిరి వేసేందుకు చెట్ల కొమ్మలు
కొడుతుండగా జారిపడి వృద్ధుడు మృతి
చింతపల్లి: మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చింతపల్లి మండలం ధైర్యపురితండాలో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన రామావత్ బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం ఉదయం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం బాలయ్య తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.
జాతరకు వెళ్లొస్తుండగా..
ఫ అదుపుతప్పి వాగులో పడిన బైక్
ఫ ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
సూర్యాపేటటౌన్: పెద్దగట్టు జాతరకు వెళ్లొస్తుండగా.. బైక్ అదుపుతప్పి వాగులో పడిపోవడంతో ఒకరి మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. సూర్యాపేట మండలం కాసరబాద్ గ్రామానికి చెందిన సుధీర్(21), సంపత్ బైక్‌పై దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో సూర్యాపేట మండలం కేసారం సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట వాగులో పడింది. ఈ ప్రమాదంలో సుధీర్ అక్కడిక్కడే మృతిచెందగా, సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సంపత్‌ను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment